బంజారాల ఆరాధ్య దైవం ‘సంత్ సేవాలాల్’

బంజారాల ఆరాధ్య దైవం ‘సంత్ సేవాలాల్’

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
వరంగల్ బ్యూరో, పిబ్రవరి 21 (విశ్వం న్యూస్) : వరంగల్ బ్యూరో ఫిబ్రవరి 21 (విశ్వం న్యూస్ ) : గిరిజన, బంజారాల అభ్యున్నతి కోసం కృషి చేసి, సన్మార్గంలో నడిపించి బంజారాలకు సంత్ సేవాలాల్ ఆరాధ్య దైవంగా మారారని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. మంగళవారం సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండల కేంద్రంలోని కమ్మ ఫంక్షన్ హాల్ లో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యుడు సీతారాం నాయక్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని వారు అన్నారు. సేవాలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, బంజారా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవంలో మాట్లాడుతున్న సబ్ రిజిస్టర్ తస్లీమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *