సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో…
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : సీఎం కేసీఆర్ పుట్టినరోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నప్పటికీ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదనే రూల్స్ ఉంటాయి. అందువల్ల ప్రారంభం చేపట్టాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. రాత్రింబవళ్ళు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు గుర్తుగా ప్రారంభించాలి అని భావిస్తే అది నెరవేరటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *