గృహనిర్బంధంలో అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి

అంబర్ పేట, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసికి నిధులు కేటాయించడంలో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అంబర్పేట పోలీసులు గృహనిర్బంధం చేయడం జరిగింది. కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసి కి కేటాయించాల్సిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి జిహెచ్ఎంసికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇవ్వకపోవడం రాష్ట్ర బడ్జెట్ లో 3000 కోట్లు నిధులు కేటాయించాలని కోరగా అతి తక్కువ బడ్జెట్ 30 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు.