Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

సికింద్రాబాద్‌-విశాఖపట్నం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు

హైదరాబాద్‌, జనవరి 15 (విశ్వం న్యూస్) : సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించారు. వందే భారత్ సీరీస్‌లో ఇది ఎనిమిదవది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు మొదటిది. ఆదివారం సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌ను విశాఖపట్నంను కలిపే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పండుగ వాతావరణంలో నేడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు గొప్ప బహుమతి లభిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ల భాగస్వామ్య సంస్కృతి మరియు వారసత్వాన్ని కలుపుతుంది అని ప్రధాని అన్నారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ నవభారత సామర్థ్యానికి చిహ్నం. మార్పు బాటలో శరవేగంగా పయనిస్తున్న భారత్ కు ఇది చిహ్నం.
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సోమవారం నుంచి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెగులర్ సర్వీసులు ఉంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజూ వందే భారత్ రైలు నడుస్తుంది. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ ఏసీ చైర్ కార్ 751 సీట్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో 57 సీట్లు ఉన్నాయి.

వందే భారత్ ప్రత్యేకతలు..
* అల్ట్రా మోడల్ కోచ్ లు
* ఎగ్జిక్యూటివ్ క్లాస్
* పూర్తి స్థాయి సిట్టింగ్ తో పాటు ఏసీ సదుపాయం
* పూర్తిగా దేశీయంగా తయారు
* సికింద్రాబాద్-విశాఖ మధ్య దూరం బాగా తగ్గిపోతుంది
* కేవలం 8.40 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *