ప్రభుత్వ భూమిలో వెలిసిన గుడిసెలు
వరంగల్ బ్యూరో జనవరి 16 (విశ్వం న్యూస్) : గోవిందరావుపేట మండలం పసర నాగారం శివారులోని 109 /ఏ సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిని సిపిఎం పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో 500 మంది నిరుపేద ప్రజలతో ఇంటి స్థలాల పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు తొమ్మిది ఎకరాల భూమిలో గుడిసెలు వేశారు. ఇట్టు భూమిని కలెక్టర్ ప్రభుత్వము భూమిగా నిర్ణయించి తాసిల్దార్ కు స్వాధీన పరచడం జరిగింది వీరికి సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి తీగల ఆగిరెడ్డి చిట్టిబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని అనేక ఉద్యమాలు చేశామని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అందుకే ప్రభుత్వ భూములు నిరుపేదలకు ఇంటి స్థలాలు పోరాటం చేశామని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.