ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

ఎమ్మెల్సీ కవితకు షాక్..
మరోసారి జ్యుడీషియల్
మే 7 వరకు కస్టడీ పొడిగింపు..

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి
ఎదురుదెబ్బ తగిలింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో కవితను ఈడీ, సీబీఐలు వేర్వేరుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే నేటితో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవిత జ్యుడీషియల్ కస్టడీస్ట పొడిగించాలని దర్యాప్తు అధికారులు కోరారు.

ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, చన్ప్రీత్ సింగ్ల జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోల్లీ ని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వీరిద్దరుద్ద కూడా ప్రస్తుతం వారు తీహార్ జైలులో ఉన్నారు. వారికి గతంలో వేర్వేరుగా విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో నేడు వారిని వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు.

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కా మ్కు సంబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన్ల ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా.. న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేశారు. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ఇంకా ముగియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *