నత్త నడకగా సాగుతున్న ఎస్ ఎన్ డి పి పనులు

నత్త నడకగా సాగుతున్న
ఎస్ ఎన్ డి పి పనులు

  • రెండు వారాలుగా మూసివేసిన
    పర్వతాపూర్ ప్రధాన రహదారి
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు,వ్యాపారులు
  • ఎస్ ఎన్ డి పి పనులు త్వరగా పూర్తి చేయాలని తుంగతుర్తి రవి డిమాండ్

ఫిర్జాదిగూడ, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 110 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభమైన ఎస్ ఎన్ డి పి పనులు నత్త నడకగా సాగుతున్నాయి. పర్వతాపూర్ అరోరా కళాశాల వద్ద రోడ్డుకు అడ్డంగా పైపుల నిర్మాణం ఉన్నందున రోడ్లను పూర్తిగా మూసివేశారు. రోడ్డు మూసివేసి రెండు వారాలు గడుస్తున్న పైప్లైన్ పనులు ఇంకా పూర్తి కాలేదు.

ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మాట్లాడుతూ ఎస్ ఎన్ డి పి పనుల్లో భాగంగా రెండు వారాలకు పైగా పర్వతాపూర్ రోడ్డును మూసి వేయడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,కేవలం సుమారు 20 మీటర్ల పైప్ లైన్ వేయడానికి వారాల తరబడి సమయం తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో అని తుంగతుర్తి రవి ఎస్ ఎన్ డి పి అధికారులపై మండిపడ్డారు.

నిత్యం పర్వతాపూర్ – ఉప్పల్ వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు,వ్యాపారస్తులు, రోడ్డును మూసి వేయడం వల్ల అదనంగా రెండు మూడు కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందని దీంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎస్ ఎన్ డి పి పనులు త్వరగా పూర్తయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *