చిత్తారమ్మ తల్లి భక్తుల దాహార్తి తీర్చిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి

అంబర్‌పేట్, జనవరి 22 (విశ్వం న్యూస్) : ఆదివారం ఉదయం కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో అమ్మలగన్న అమ్మ శ్రీ చిత్తారమ్మ దేవి తల్లి జాతర సందర్భంగా మంచినీటి పంపిణీ కార్యక్రమం చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి . అమ్మలగన్న అమ్మ అమ్మ శ్రీ చిత్తరమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారము నాడు ఉదయం అక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు పోలీస్ యంత్రాంగానికి అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మినరల్ వాటర్ బాటిళ్లు అందజేసి వారి దాహార్తిని తీర్చడంలో బాధ్యతను నిర్వర్తించుకున్న సొంటి రెడ్డి పున్నారెడ్డి అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని చిత్తారమ్మ దేవి తల్లిని మొక్కడం జరిగింది.