మచ్చలేని చంద్రుడు

  • కనుగోలుగాడి కళ్ళల్లో జిల్లెడుపాలు పోయాలని ఉంది.
  • అబద్దాలు ప్రచారం చేయడంలో వాడు గోబెల్స్ ని మించిపోయాడు.

గద్దెనెక్కాక హామీలు అమలు చేయకపోవడమేగాకుండా ప్రజలను ఏమార్చడానికి అదే అబద్ధపు ప్రచార వ్యూహాన్ని నమ్ముకున్నాడు. తమ పబ్బం గడుపుకోవడానికి ఇప్పటికీ బాపు కేసిఆర్ నే వాడుకుంటున్నారు. అందులో భాగమే ఈ శకుంతల ఉదంతం. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఇట్లాంటి పనికిమాలిన ప్రచారాలను తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నేత, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్ పర్సన్ మంత్రి శ్రీదేవి తీవ్రంగా ఆక్షేపించారు.

హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : ప్రజల్లో భయంరేకిత్తించడం, వైరిపక్షాలపై ద్వేషంనింపడం, సమాజంలో హింసోన్మాదాన్ని సృష్టించడం గోబెల్స్ అనుసరించే ప్రదాన ప్రచార విధానం.
సునీల్ కనుగోలుగాడుకూడా గోబెల్స్ లాగే ప్రజల్లో భయం,ద్వేషం నూరిపోస్తాడు.
వైరిపక్షాలపై తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తాడు. అబద్దాలతో ఎల్లకాలం విజయం సాధించలేమని గోబెల్స్ జీవితమే మనకు పెద్ద ఉదాహరణ.

గోబెల్స్ జీవితం ఎంత దయనీయంగా ముగిసిందో కనుగోలు తెలుసుకోవాలి.
బాపు కేసిఆర్ గారిపై తీవ్ర విషప్రచారం చేశాడు.
బాపుపై ప్రజల్లో అనుమానాలు రేకిత్తించాడు.
తీవ్రపదజాలంతొ దాడులు చేయించాడు.
దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు.
ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు.
అబద్దాలు చెప్పి గద్దెనెక్కించాడు…….

గద్దెనెక్కాక హామీలు అమలు చేయకపోవడమేగాకుండా ప్రజలను ఏమార్చడానికి అదే అబద్ధపు ప్రచార వ్యూహాన్ని నమ్ముకున్నాడు.
తమ పబ్బం గడుపుకోవడానికి ఇప్పటికీ బాపు కేసిఆర్ నే వాడుకుంటున్నారు…….

అందులో భాగమే ఈ శకుంతల ఉదంతం.
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఇట్లాంటి పనికిమాలిన ప్రచారాలను తెరపైకి తెస్తున్నారు.
నిప్పుకు చెదలుపట్టవు, బాపుకు మీరుపూసే మలినాలు అంటవు.
బాపు ఒక పోరాటయోధుడు.
నిజమైన ప్రజానాయకుడు.
అరవైఏళ్ళ చెరనుండి రాష్ట్రాన్ని విడిపించిన త్యాగధనుడు.
ఇట్లాంటి చౌకబారు పనులు చెస్తాడని మీరెలా అనుకుంటున్నార్రా!!
మీరు ఇంత అనైతికంగా ప్రచారంచేస్తే జనం నమ్ముతారని అనుకోవడం మీ అవివేకం…….

నెలవంకకైనా మచ్చకలదేమోగానీ మచ్చలేని చంద్రుడు మా చంద్రశేఖర్ రావు బాపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *