ఇంటర్మీడియట్-2023 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల విజయఢంకా

ఇంటర్మీడియట్-2023 ఫలితాలలో
శ్రీ చైతన్య విద్యాసంస్థల విజయఢంకా

కరీంనగర్ బ్యూరో, మే 10 (విశ్వం న్యూస్) : మంగళవారం రోజు ప్రకటించిన ఇంటర్-2023 ప్రథమ, ద్వితీయ ఫలితాలలో కరీంనగర్ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయఢంకా మ్రోగించారు. మంగళవారం నాడు ప్రకటించిన ఫలితాలు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బోకెలతో సత్కరించారు. విద్యార్థులు ప్రణాళిక బద్దంగా అభ్యసించి గణనీయమైన మార్కులు సాధించి మెరుగైన ఫలితాలను రాబట్టారు. అంకిత భావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ప్రతిభావంతుల వివరాలు రెండవ సంవత్సర ఫలితాలలో యం.పి.సి నందు పి. బిందు 990, బై.పి.సి నందు జి. రోషిని 989, యం.ఇ.సి నందు జి. ఈశ్వర్ తేజ 983. మొదటి సంవత్సర ఫలితాలలో యం.పి.సి. నందు కె. విశ్వహరితాజ్ 466, కె. స్నిగ్ధ 466, కె. అక్షయ 466. బి.పి.సి నందు యం. సిరివెన్నెల 435. యం. ఈ.సి నందు టి. హారిక 479, సి.ఈ.సి నందు జె. ప్రశాంత్ 491 మార్కులు సాధించారు. నాణ్యమైన కార్పోరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్ధేశ్యంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు.

శ్రీ చైతన్య గ్రూప్ అఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నామని తెలిపారు. పటిష్టమైన ప్రణాళికలతో పాటు నిరంతర పర్యవేక్షణ, అధ్యాపకుల అత్యుత్తమ బోధన విద్యార్థులు పట్టుదల, అహర్నిషలు కృషి ఫలితంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో విజయం సాధించారని తెలిపారు. ప్రతి ఏడాది ఎంసెట్, నీట్, ఐఐటి జెఈఈ తదితర పోటీ పరీక్షలలో విద్యార్థులు ర్యాంకులు సాధించి శ్రీచైతన్య ఆణిముత్యాలుగా నిలుస్తున్నారని తెలిపారు. అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ఈ ఘన విజయంలో పాలు పంచుకున్న తమ అధ్యాపక బృందానికి రమేష్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాక్రిష్ణ, ఎజియం శ్రీనివాస్ మరియు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *