- వాణిజ్య పన్నులు శాఖలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి సీటీవో స్థాయి వరకు ప్రమోషన్లు ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య పన్నుల కమిషనర్ టీకే శ్రీదేవికి కృతజ్ఞతలు
- వాణిజ్య పపన్నుల శాఖకు కమిషనర్ గా టీకే శ్రీదేవి ఉండటం వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అదృష్టం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి.
హైదరాబాద్, జూలై 23 (విశ్వం న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ లకు వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ప్రమోషన్ లేక కొన్ని సంవత్సరాల నుండి వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
అలాంటి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎంతో చోరువ తీసుకొని జూనియర్ అసిస్టెంట్ లకు- సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏసిటిఓ ప్రమోషన్లు ఇవ్వడానికి ఎంతో చొరవ తీసుకుంటున్నందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ టీకే శ్రీదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది గత కమిషనర్లకు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోయేది కానీ ఈ రోజు కమిషనర్ గా టీకే శ్రీదేవి పదవి బాధ్యతలు చేపట్టి నప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఒక ఉద్యోగి సమస్యలను పరిష్కరిస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్నాశ్రీదేవి అలాంటి కమిషనర్ మా వాణిజ్య పనుల శాఖకు రావటం వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అదృష్టం.
ఉద్యోగుల బదిలీలతోపాటు, ప్రమోషన్లను కూడా ఇస్తూ బదిలీలను కూడా చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వాణిజ్య పనుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితో పాటు, అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ సునీత, జాయింట్ కమిషనర్ రవి, అధికారులు అందరికీ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఇండియాలోనే మొట్టమొదటి ప్రథమ స్థానంలో జీఎస్టీ రెవిన్యూ రావడానికి కూడా ఎంతో కృషి చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టి కె శ్రీదేవికి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ తేవడానికి రాత్రి పగలు కృషి చేయాలని, ఎవరైనా వ్యాపారస్తులు బకాయి ఉన్న టాక్స్ లను కూడా వెంటనే కట్టించడానికి అధికారులు ఉద్యోగులు కృషి చేయాలని అలాంటప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే జీఎస్టీ లో మొదటి స్థానం రావడానికి అవకాశం ఉంటుందని టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.