అల్పపీడనంగా మారిన వాయుగుండం.. మరో మూడు రోజులు వానలే..!

హైదరాబాద్, జూలై 21 (విశ్వం న్యూస్) : వచ్చే మూడు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

మూడు రోజులు పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. అలాగే గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో గాలులు విస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కుమురంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

చిలికా సరస్సు వద్ద ఏర్పడిన వాయుగుండం రాత్రి బలహీన పడి అల్పపీడనంగా మారిందని వివరించింది. వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాన్ని తాకిందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *