విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్ముతున్న వారికి రిమాండ్
విద్యార్థులే టార్గెట్ గా గంజాయి
అమ్ముతున్న వారికి రిమాండ్

- పట్టుకున్న సిబ్బందిని అభినందించిన సీఐ మల్లయ్య
- విద్యార్థులు,ఎవరైనా గంజాయికి అలవాటు పడద్దని కోరారు
పీర్జాదిగూడ, జూన్ 6 (విశ్వం న్యూస్) : మంగళవారం విశ్వాసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ అదేశాలు మేరకు ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అంకిరెడ్డి పల్లి జంక్షన్ వద్ద రైడ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా నీలం బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ లో ఎండు గంజాయి దొరికింది. వారిని విచారించాగా అట్టి గంజాయిని ఒరిస్సా ఏరియా నుంచి తెచ్చి అంకిరెడ్డిపల్లి, కీసర చుట్టూ పక్కన గల కాలేజీ విద్యార్థులకు, ఇతరలకు అమ్ముచున్నామని తెలిపినారు.వెంటనే అక్రమంగా గంజాయి రవాణా,ఆమ్మడం, కలిగి ఉండడం నేరమని వారి వద్ద లభించిన 5 కిలోల 382 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ మల్లయ్య మాట్లాడుతూ వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఏ1 ముద్దాయిగా సంగ్రామ్ ప్రధాన్ తండ్రి జోగేశ్వర్, ఏ2 ఉత్కల్ బెహరా తండ్రి వశిత బెహరా ఎండు గంజాయిని ఒడిశా దగ్గర తక్కువ ధరకు తీసుకువచ్చి కాలేజ్ స్టూడెంట్స్ కు గంజాయి తాగే అలవాటు కలిగిన వ్యక్తులకు అధిక దరకు అమ్మచున్నామని తెలిపినారు. వారి పూర్తి వివరాలు ఏ1సంగ్రామ్ ప్రధాన్ తండ్రి జోగేశ్వర్ (25) అడ్రస్ దేవులబెడ, పూర్ణమంత్రి, అంగుల్ ఒడిశా జిల్లా, ఏ2 ఉత్కల్ బెహరా తండ్రి వశిత బెహరా అడ్రస్ హర్బంగా, కేసింగ, ఒడిశా జిల్లాకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేసి, 5.382కేజీల ఎండు గంజాయి, వీవో ఫోన్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి గౌరవ కోర్ట్ ద్వారా రిమాండ్ చేయడం జరిగిందని అన్నారు.ఈ దాడులలో సిఐ మల్లయ్య,ఎస్సై లు పురుషోత్తం రెడ్డి, శ్రావణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
