ప్రజల మనస్సును గెలిచిన
ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

- తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల, వివిధ శాఖలతో సమీక్ష సమావేశం
హుజురాబాద్ ఆర్సి, జూన్ 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నీటిపారుదల శాఖ వివిధ శాఖలతో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ముందు ఆలోచనతో అన్ని వర్గాలను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనస్సును గెలిచిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో కూడా ఇన్ని పథకాలు లేవని అన్నారు. తెలంగాణ రాకముందు ఎండాకాలంలో నీళ్ల కోసం బిందెల పట్టుకొని మహిళలు ఇబ్బంది పడేవారు. తెలంగాణ వచ్చాక వర్షాకాలం ఎండాకాలం అనే తేడా లేకుండా నీళ్లు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వచ్చాక సీఎం కేసీఆర్ హుజరాబాద్ రైతులకు రైతుబంధు ద్వారా 523 కోట్ల 75 లక్షల పెట్టుబడి సాయం, ప్రమాదవశాస్తు చనిపోయిన రైతుల కుటుంబాలకు నియోజకవర్గంలో 840 మంది కుంబాలకు సుమారుగా 42 కోట్ల రైతు భీమా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. రైతుల కోసం 24 గంటల కరెంటు దాదాపుగా 32 వేల కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ కింద 800 కోట్లను రైతుల కోసం రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేస్తుంది. గ్రామంలో వీధిలైన్ల కోసం 540 కోట్లు ఖర్చు చేసింది. 70 వేల కోట్లతో సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్ర మొత్తం అన్ని గ్రామాల రైతులకు నీటి సమస్యను తీర్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 99,948 వేల ఎకరాలకు కాలేశ్వరం ద్వారా నీరు అందించడం జరిగింది. తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గం 111 కోట్లతో చెరువులలో మట్టిని తీయడం జరిగింది.
నియోజకవర్గం 106 గ్రామాలలో సీఎం కేసీఆర్ అన్ని గ్రామాలలో అభివృద్ధి జరిగింది. రైతు కష్టాలను తెలంగాణ వచ్చాక తొలగిపోయాయని. పక్కన ఉన్న మహారాష్ట్ర లో బిజెపి ప్రభుత్వం ఉంది. అక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అమలు చేయాలని ఆ ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని దేశంలో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, అధికారులు తాసిదార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వీఆర్ఏ అంగన్వాడి, ఐకెపి, ఆర్పిలు, వివో ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.