బైరాగిగుడ:రిషి పబ్లిక్ పాఠశాలలో
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

బండ్లగూడ జాగిర్, (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో బైరాగిగుడ రిషి పబ్లిక్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులు ఎందరో సమాజానికి ఆదర్శంగా నిలిచారని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.