‘మన శంకర వరప్రసాద్ గారు’ టికెట్ రేట్లు పెంపు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జనవరి 10, 2026 (విశ్వం న్యూస్) : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు జనవరి 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయంతో థియేటర్లలో భారీ కలెక్షన్లపై అంచనాలు పెరిగాయి.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందించిన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. ఎమోషన్స్, హాస్యం, మాస్ సీన్స్ సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *