
- డ్రామా కంపెనీ ప్రెజెంట్స్:
‘కన్నీటి కట్టుకథలు‘ - నటీనటులు: గురుశిష్యులు & కో
- సీన్ 1: కృష్ణా జలాలపై కేసీఆర్ గారి గళం విప్పగానే గురుశిష్యులకు ముచ్చెమటలు! (అరెరే, దొరికిపోయాం రోయ్!)
- సీన్ 2 (డైవర్షన్): జనంలో పరువు
పోతుందని ‘ఏడుపు సీను’
స్క్రిప్ట్ రెడీ. రంగంలోకి
ఎమ్మెల్సీ కవిత గారు. - సీన్ 3 (యాక్షన్): సొంత పార్టీ, సొంత వాళ్లపైనే అడ్డగోలు విమర్శలు. (ఎవరి స్క్రిప్ట్ చదువుతున్నారో మరి?)
- ట్విస్ట్: ఏడుపులో ‘పేరాశ’ తప్ప ‘సహజత్వం’ లేదని జనం గ్రహించేశారు. డ్రామా అట్టర్ ఫ్లాప్!
హైదరాబాద్, జనవరి 10, 2026 (విశ్వం న్యూస్) : కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు గళం విప్పిన వెంటనే అధికార కాంగ్రెస్ శిబిరంలో కలవరం మొదలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను ముందుకు తెచ్చి, మండలిలో ‘ఏడుపు సీన్’ను ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీపై, సొంత కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎల్లో మీడియాను అలరించేందుకే తప్ప ప్రజాస్వామ్య విలువల కోసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కవిత చేసిన విమర్శల్లో సహజత్వం లోపించిందని, ఆమె వ్యాఖ్యల్లో ఆవేదన కంటే రాజకీయ లెక్కలే ఎక్కువగా కనిపించాయని ప్రజలు భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నాటకం ప్రజల్లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయిందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇదిలా ఉండగా, గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ బలాన్ని మరోసారి నిరూపించాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్ద నాయకుల ప్రత్యక్ష అండ లేకపోయినా, గ్రామ–మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ బెదిరింపులకు భయపడకుండా పోటీలో నిలిచి గులాబీ జెండాతో ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబ్బుల పంపిణీ చేసినప్పటికీ, బీఆర్ఎస్ దాదాపు 45 శాతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ గారు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారనడానికి నిదర్శనమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
“పదేళ్లు ఏం పీకారనే ప్రశ్నలకు గ్రామీణ తెలంగాణే సమాధానం ఇచ్చింది” అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కూర్చొని చేసే విమర్శల కంటే గ్రామీణ ప్రజల తీర్పే రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.స్వార్థ రాజకీయాల కోసం కుటుంబాలను, పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయకూడదని, ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.
