డా. కవ్వంపల్లికు ఘన స్వాగతం

కరీంనగర్, జనవరి 10, 2026 (విశ్వం న్యూస్) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన నాయకుడు, మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన నేపథ్యంలో ఈరోజు కరీంనగర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం అలుగునూర్ చౌరస్తాలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి గారు డా. సత్యనారాయణ గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కరీంనగర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్న రజిత రెడ్డి, హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, ధర్మారం గ్రామ సర్పంచ్ చింతిరెడ్డి పద్మ, శంకర పట్నం బ్లాక్ అధ్యక్షురాలు కవ్వ పద్మ పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సొల్లు సునీతతో పాటు రాజేశ్వరి, స్వప్న, దేవేంద్ర తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియామకం ద్వారా ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు మరింత బలమైన గొంతు ఏర్పడుతుందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.