అడ్వకేట్ యుగంధర్ పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి అమానుషం

అడ్వకేట్ యుగంధర్ పై
ఎమ్మెల్యే గాదరి కిషోర్
అనుచరుల దాడి అమానుషం

  • ఇసుక మాఫియా, దళిత బంధు మీద సంపాదించిన డబ్బులతో
  • గుండాగిరీలని పెట్టి పోషిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్
  • 12 మంది రౌడీలు, ఎమ్మెల్యేను ఏ1 గా అటెంప్ట్ మర్డర్ బుక్ చేయాలి
  • తెలంగాణ రాష్ట్ర మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్, మే 22 (విశ్వం న్యూస్) : అప్పట్లో సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వకేట్స్ వామన్ రావు దంపతుల పట్టపగలే నడిరోడ్డుపై మర్డర్ కేసు, ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు ప్రజల కోసం న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాది యుగంధర్ పై దాడి, మర్డర్ కు ప్లాన్.. ఇదంతా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనిపిస్తుందా అని తెలంగాణ రాష్ట్ర మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వారు ప్రశ్నించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోనీ అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అడ్వకేట్ యుగంధర్ ను తెలంగాణ రాష్ట్ర మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వారు పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం ఎమ్మెల్యే గాదరి కిషోర్ అతని అనుచరుల మీద అటెండ్ మర్డర్ కేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మర్డర్లు, మానభంగాలు పెరిగిపోయాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుండగిరినీ పెట్టి పోషిస్తున్నారని, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారం, కబ్జాలు సెటిల్మెంట్ రంగంలో సంపాదించిన కోట్లాది రూపాయలను తను ప్రశ్నించినందుకు అవే డబ్బులు గుండా గిరీలకి ఇచ్చి అడ్వకేట్ యుగంధర్ ని చంపించే ప్రయత్నం చేశారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరూ తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతానని పేర్కొన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మా అడ్వకేట్ ను చంపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీరు ఏమి చర్యలు తీసుకుంటారోనని యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారని సూచించారు.

ఏదైనా ఉంటే న్యాయవ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి గాని గుండా గిరీలను పెట్టి పోషించి తన కారులో వెళుతున్న అడ్వకేట్ యుగంధర్ పై 20 మంది గుండాలు కర్రలు ,రాళ్లు బండరాయితో కారద్దాలు పగలగొట్టి దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ ఆ జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి ఏ1 గా ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను చేర్చాలని ఆ 12 మందిపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయపరంగా అన్ని విధాల అడ్వకేట్ యుగెందర్ కు తెలంగాణ రాష్ట్ర మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాదిగా అడ్వకేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్లాపురం భూపతి, జాయింట్ సెక్రెటరీ చిప్పలపల్లి రమేష్, చీఫ్ అడ్వైజర్ కొమురయ్య, న్యాయవాదులు గడిపే నాగయ్య, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *