ఘనంగా యుక్త హాస్పిటల్ ఎండి డాక్టర్ పురుషోత్తం జన్మదిన వేడుకలు

ఘనంగా యుక్త హాస్పిటల్ ఎండి డాక్టర్ పురుషోత్తం జన్మదిన వేడుకలు

పీర్జాదిగూడ, మే 22 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్నటువంటి యుక్త హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ పూరషోత్తం జన్మదిన వేడుకలు హాస్పిటల్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిపారు. ఈ జన్మ దిన వేడుకలు హాస్పిటల్ యాజమాన్యం ,డాక్టర్లు, సిబ్బంది తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ అనంతరం ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హాజరు అయ్యి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా ఎండి పురుషోత్తం మాట్లాడుతూ మేడిపల్లి లో అత్యుత్తమ సేవలు అందజేస్తూ ఎందరో పేద మధ్య తరగతి రోగులకు చేరువగా ఉన్న యుక్త ఆసుపత్రి ఈ రోజు నుండి మరో అడుగు ముందుకు వేస్తూ అందరికి వైద్యం చేరువలో ఉండాలని ఫ్రీ హెల్త్ స్కీం ప్రారంభిచామని తెలిపారు.ఈ హెల్త్ స్కీం లో పేషెంట్ కు అయ్యే ఖర్చులో ప్రతి విభాగంలో తక్కువ ఖర్చులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదుపాయం మేడిపల్లి మండలం పీర్జాదిగూడ,బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *