కుమ్మర్ల తొలి బోనాల జాతరను విజయవంతం చేయాలి

హైదరాబాద్:కుమ్మర్ల తొలి బోనాల
జాతరను విజయవంతం చేయాలి

తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ
అధ్యక్షులు నేదునూరి కనకయ్య
హైదరాబాద్, జూన్ 17 (విశ్వం న్యూస్) : గోల్కొండ కోటలో తెలంగాణ బోనాల విశిస్టత ‘సాంస్కృతిక ‘ఆధ్యాత్మిక చైతన్యం ఉట్టిపడే కుమ్మర్ల తొలి‌బోనం పండుగ తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అద్వైర్ర్యంలో జూన్ 22 ప్రారంభం కానున్నఅషాడ మాసం బోనాల ఉత్సవానికి హాజరు కావాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు నేదునూరి కనకయ్యకు వారి నివాసంలో ఆహ్వాన పత్రాన్నితెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అందించింది.

ఆహ్వానాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల నుండి కుమ్మర్లు గోల్కొండ తొలి బోనాల ఉత్సవంలో పాల్గొనడం వల్ల తెలంగాణ కుమ్మర కుల సామాజిక ‘సాంస్కృతిక’ ఆధ్యాత్మికత ‘ఐక్యత శక్తి బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి’ అధ్యక్షులు రావుల కోలు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్, కోశాధికారి దామా సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కాకులారం శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రావులకొల్ల వెంకటేష్ బృంథం పాల్గొని ఆహ్వానాన్ని అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *