ప్రభుత్వం 1977 గో హత్య నిషేధ
చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
కరీంనగర్, మే 26 (విశ్వం న్యూస్) : కరీoనగర్ లోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో శనివారం గోరక్ష విభాగ్ బయటక్ ఆరు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శుల ముఖ్య సమా వేశంను జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రాంత గోరక్ష ప్రముఖ్ ఈసంపల్లి వెంకన్న మాట్లాడుతూ… ప్రతి జిల్లా సరిహద్దులోని చెక్ పోస్ట్ దగ్గర ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేపట్టాలని, అక్రమ గో రవాణాను అడ్డుకునేందుకు శాశ్వత పోలీస్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేయాలి. అవసరమైతే పోలీసులకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు సహకరిస్తారని అని పేర్కొన్నారు.
కరీనగర్ జిల్లా గోరక్ష విభాగ ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు లు మాట్లాడుతూ… గో రక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయి, చట్టా వ్యతిరేకంగా గోవులను గోసంతతిని విదేశాలలకు అక్రమంగా తరలించే వారిపై పోలీసు లకు ఫిర్యాదు చేయాలి, అక్రమ రవాణా నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 1977 గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అనంత రం గో-రక్షణ గోడపత్రికలను ఆవిష్కరించారు. గో సంరక్షణ కొరకు కరపత్రాలను జిల్లాల వారీగా సీఐలు, ఎస్ఐలు, ప్రజా ప్రతినిధులకు కరపత్రాలను అందజేసి అవగాహన కల్పించాలని, గో ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, గోమాత పట్ల సమాజంలో ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ గో సంరక్షణ ప్రముఖ్ ఈసన్ పల్లి వెంకన్న, జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు, గోరక్ష విభాగ్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, నగర అధ్యక్షులు చేపూరి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, నగర అధ్యక్షులు ఇనగంటి రమేష్, జిల్లా సహయ కారదర్శి తోట రాజేందర్, మాతృ శక్తి జిల్లా సంయోజక్ శ్రీ రామోజు సంగీత, బజరంగ్ ధల్ కన్వీనర్ కన్నం శంకర్ తో పాటు ఆరు జిల్లాల అధ్య క్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.