గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి

గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ
గోవిందరావుపేట, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : మండలంలొని పసర గ్రామంలో 109 సర్వే నెంబర్లు నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున స్థానిక బస్టాండ్ నుండి భారీ ర్యాలీతొ డప్పు చప్పుల్లతో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గుడిసె వాసులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు వేసుకున్న గుడిసె వాసులకు కనీస అవసరాలు అయినా కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య అందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తక్షణమే పెదలేసిన గుడిసెలకు పట్టాలు కల్పించాలని ఐదు లక్షలతో పక్క ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై నేటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా తుమ్మల వెంకట రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు తీగల ఆగి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొదిళ్ల చిట్టిబాబు, ప్రజా సంఘాల నాయకులు అంబాల పోషాలు, కడారి నాగరాజు, గుండు రామస్వామి, రమేష్, రాజు, రాజేశ్వరి, సరిత, సువర్ణ, సకినాల రాజేశ్వరి, పాయం శారద, అంబల మురళి, అరుణ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న గుడిశవాసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *