డిమాండు తగ్గని ఎకైక పంట ఆయిల్ పామ్

డిమాండు తగ్గని ఎకైక పంట ఆయిల్ పామ్

ఆయిల్ ఎగుమతి చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం
రాష్ట్ర బీసి సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపు

తిమ్మాపూర్, జనవరి 4,( విశ్వం న్యూస్) : పంటలను పండించడంలో అనపూర్ణగా నిలిచిన తెలంగాణలో ఆయిల్ పామ్ పంటను సాగు చేసి దేశంలోనే అయిల్ ను ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దుదామని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపు నిచ్చారు. బుదవారం కలెక్టరేట్ ఆడిటోరి యంలో నిర్వహించిన ఉద్యాన, వ్యవసాయ పట్టు పరిశ్రమ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవెటు లిమిటెడ్ వారిచే ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమంలో అయన ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయని వాటికి అనుగుణంగానే పంటలను పండించుకోవడం జరుగుతుందని,ప్రాంతం, దేశం ఎదైన ఖచ్చితంగా ఉపయోగపడేది కేవలం వంటనూనే మాత్రమే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కు డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా అయిల్ పాంను సాగును చేయాలని సూచించారు. అయిల్ పామ్ సాగును ప్రోత్సహించేలా విత్తనాల పంపిణి నుండి వాటి అమ్మకం వరకు లోహియా ఎడిబుల్ సంస్థ బాద్యత వహిస్తుందని పేర్కోన్నారు. అయిల్ పామ్ పంట మొండి రకమని, పంటకు అందజేసె నీటి 1 వంతు నీరు మాత్రమే సరిపోతుందని, ఎటువంటి వాతావర ణంలో నైనసరే సునాయాసంగా తట్టుకుని నిలబడు తుందని తెలిపారు. వీటిని ఒకసారి వాటిని నాటిన తరువాత 3 ½ సంవత్సరాల వరకు అంతర్ పంట లుగా కూరగాయలను సాగుచేయాలని, ఆ తరువాత మొక్కలు ఎదిగా దాదాపు 30 సంవత్సరాల వరకు పంటదిగుబడిని అందిస్తుందని తెలిపారు. అతి తక్కువ నిర్వహణ వ్యయం గల ఆయిల్ పామ్ పంటను స్వయంగా పండించాలని తన 45 ఎకరాల స్వంత స్థలంలో సాగుచేయడం జరిగిందని, మరికొంత భూమిలో సాగుచేస్తానని పేర్కోన్నారు. పండించిన పంటను సంస్థకు అందించిన వెంటనే రైతుకు నగదు ను ఆందించడం జరుగుతుందని, ఎత్తు తక్కువగా ఉండే లెమ్ వెరియంట్ వంటి కొత్తపంటను అందు బాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ ఆయిల్ పామ్ సాగు ను ఖమ్మం జిల్లా సత్తుపల్లి రైతులు విజయవంతం చేశారని, రైతులందరు సత్తుపల్లి ని సందర్శించి అక్కడి రైతుల అభిప్రా యాలను, వారి అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు. భారతదేశం 90 నుండి 95శాతం నూనేను దిగుమతి చేసుకుంటుందని, మనం అయిల్ పామ్ పంటను సాగుచేసి ఎగుమతి చేసే దిశగా ఎదగాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ… అయిల్ పామ్ పంట సాగు పై దృష్టిని సారించి అందరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. పంటను, డ్రిప్ ను సబ్సిడి పై అందించడం జరుగుతుందని, అతి తక్కువ నిర్వహా ణ వ్యయం గల ఆయిల్ పామ్ ను సాగు చేసి రాబోయో రోజుల్లో అధిక దిగుబడిని పొందాలని తెలిపారు. వరిసాగులో సగం కన్న తక్కువ నీటిని అందించి ఈ పంటను సాగుచేయగలమని తెలిపారు. ఈ పంటకు కోతుల పక్షుల బెడద ఉండదని, పంట కొనుగోలు బాద్యత మొత్తం లోహియా ఎడిబుల్ సంస్థ వహిస్తుందని, రైతులు వారి పోలంలో అయిల్ పామ్ ను సాగుచేయాలని అన్నారు. చోప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ… అయిల్ పాం ను తన పొలంలో సాగుచేస్తున్నానని, తాను సాగుచేసిన పంటను ఫోటోలను అవగాహన కార్య క్రమంలో ప్రజంటేషన్ చూపిస్తున్నారని పేర్కోన్నారు. ఈ పంటవలన కోతులబెడద కూడా ఉండదని ఎకాలంలోనైనా వాతావరణ పరీస్థీతుల్లో సైతం సమర్దవంతంగా తట్టుకొని నిలబడుతుందని అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ బాబు మాట్లాడుతూ… రైతులు ఒకే రకమైన వరిసాగును మాత్రమే కాకుండా అయిల్ పాం వంటి పంటలపై దృష్టిసారించాలని అన్నారు. దీర్గకాల దిగుబడినిచ్చె అయిల్ పాం పంటను సాగుచేసి అధికలాబాలను గడించాలని, ఇదివరలే పంటను సాగుచేసి లాబా లను ఆర్జించిన సత్తుపల్లి వంటి ప్రాంతాలను సందర్శించి వారి అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్, ఆత్మపిడి ప్రియదర్శిని, శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, లోహియా సంస్థ అధికారి రంగనాయకులు, రైతులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *