సమస్యలపై నిలదీస్తారని డైవర్షన్‌ రాజకీయాలు

  • తెలంగాణలో గాడి తప్పుతున్న రాజకీయాలు… అయోమయంలో ప్రజలు
  • కాంగ్రెస్ వాళ్ళకి ప్రజలంటే భయం ప్రజాస్వామ్యం అంటే భయం.
  • ప్రజలను ఏమార్చి గద్దెనెక్కడం, ప్రజలను అణగ దొక్కడమే వాళ్ళ లక్ష్యం.
  • ప్రజా వ్యతిరేక విధానాలు చేయడమే వాళ్ళకు తెలుసు.

హైదరాబాద్, అక్టోబర్29 (విశ్వం న్యూస్) : ప్రజల కోసం నిలబడే వారంటే వాళ్లకు చచ్చేంత భయం. ప్రజల కోసం ప్రశ్నించే వారిని చూస్తే వాళ్ళకు కాళ్ళ లో వణుకు.అందుకే వాళ్లు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కల్లోలిత చట్టాన్ని తెచ్చారు. టాడా, పోటా,ఊపా లాంటి భయంకరమైన చట్టాలు తెచ్చారు.

నేడు వాళ్ళు తన సహజరూపాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఎన్నో ఏళ్ళ క్రితం విన్న 144 సెక్షన్లు, 163 సెక్షన్లు మళ్లి వింటున్నాం. ఒకప్పుడు మనము కర్ఫ్యూ విధించిన ప్రాంతాలుగా డబీల్ పూర ,ఛత్రినాక, టోలిచౌకు, చార్మినార్ చాంద్రాయణగుట్ట ఉండేవి. ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పదేళ్లు పచ్చగా ఉన్న మన తెలంగాణలో నిషేధిత చట్టాలు అమలు చేస్తున్నారు.

వాళ్లు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిలదీసి అడుగుతామని 163 సెక్షన్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ధర్నా చౌక్ పై నిషేధం ఎత్తేస్తామని ఫోజులు కొట్టిన వాళ్లే నేడు రాష్ట్రమంతా నిషేధం విధిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కవ్వింపు చర్యలకు భయపడదు, నిషేధాలు నిర్బంధాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉంది.

త్యాగాలకు వెరువక జైలుకెళ్లిన నేతలను అందించిన త్యాగాల సాలు దానికుంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైనందువల్ల మన మన నాయకులను నిర్బంధించాలి అనుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు వాళ్ళ వైఫల్యాలను మరిపించడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిలబడుతుంది ప్రజల కోసం కలబడుతుంది. కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల ముందు నిలుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *