ఓటు హక్కు జన్మ హక్కు

  • ఓటు హక్కు ప్రాముఖ్యత భారత ప్రజాస్వామ్య ఎన్నికలు

వీణవంక, మార్చి 19 (విశ్వం న్యూస్) : జాతీయ ఓటర్ల దినోత్సవం 25 సందర్భంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్రభుత్వాలను మార్చే ఒక సాంప్రదాయాన్ని కల్పిస్తాయి అయితే ఎన్నికల విధానంలో చాలా విప్లవత్మక మైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అస్థిరత్వాన్ని ఎదుర్కొంటుండగా మన దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం సుస్థిరంగానే కొనసాగుతూనే ఉన్నది. మనదేశంలో పేద సామాన్య నిరక్షరాస్య ప్రజలు ఎన్నికల పట్ల ఆసక్తిని చూపడం మన ప్రజాస్వామ్య గొప్పతనంగా భావించవచ్చు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగొందుతున్న భారత ప్రజాస్వామ్య ఏడు దశాబ్దాల కాలంలో, అనేక రంగాలలో విజయవంతమైనప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం విఫలమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రధాన ఆధారమైన ఎన్నికల వ్యవస్థలో లోపాలు మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి.

ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ధన ప్రాబల్యం హింసకాండ, అందులోను రాజకీయ పార్టీలు నేరస్తులకు నేల చరిత్ర కలిగిన వ్యక్తులకి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించడం వల్ల నేరా రాజకీయాలు, హింస రాజకీయాలు, నేడు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాం వాదన కలదు, రాజకీయ పార్టీలకు సైద్యాంతిక నిబద్ధత లేకపోవడం, రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి ఉండకపోకపోవడం. వ్యక్తి ఆరాధన, కుటుంబ ఆరాధన, వంటి అంశాల వల్ల అంతర్గత ప్రజాస్వామ్యం లేక ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన దిశలో నడిపించలేకపోతున్నాం.

చట్టం అందరికీ సమానంగా వర్తించేలా సంస్కరిస్తే అందరికీ ఉపాధి అవకాశాలు నైపుణ్యాలని మౌలిక వసతులన్నీ అందిస్తే ప్రభుత్వాలకు సాధికారత నిస్తే ఎన్నికల వ్యవస్థను పార్టీలను సంస్కరిస్తే అప్పుచేసి పప్పుకూడు లేకుండా ఉచితలకు అభివృద్ధికి మధ్య సమతూకం పాటిస్తే, వచ్చే పాతికేళ్లలో మన మాటలు చేతలు ఈ అంశాలు చుట్టిన సంఘటన తదేకంగా తిరుగుతూనే దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువ జనాభా సాంకేతికల సహాకారంతో ప్రతి బిడ్డ ఎదిగే అవకాశాలు లభిస్తాయి. నివారించలేక బాధలు తలుగుతాయి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుంది తెలంగాణ రాష్ట్రం అందులో ముందు ఉంటుంది. వీటన్నిటికీ కారణం, ఎన్నికల్లో ఓటు హక్కు అని బ్రహ్మస్రాన్ని నిర్భయంగా ప్రజాస్వామ్యంలో ఎవరికి తలుగకుండా వెళ్లే విధంగా ముఖ్యంగా యువత యువకులు వారి యొక్క కర్తవ్యాన్ని పెంచుకోవాలి భవిష్యత్తును శాసించాలన్న ఎన్నికల్లో ద్వారానే ప్రభుత్వాలు మార్పిడిని ప్రజాస్వామ్య విలువల్ని ఓటు అనే ఆయుధంతో మార్పు తీసుకురావచ్చు. దీనికి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగంలో 15వ విభాగంలోని ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉన్నాయి. ‌
భారతదేశంలో 94 కోట్ల ఓటర్లు ఉన్నారు, అందులో 56 కోట్ల యువతి యువకులు ఉన్నారు.

భారత దేశ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా గమనించండి ఒక ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నుకునే అభ్యర్థులు ప్రజలకి 5 సంవత్సరాల పరిపాలనకి వెయ్యి రూపాయల చొప్పున మీకు ఓటుకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొన్నట్లయితే సంవత్సరానికి ₹200 అంటే రోజుకి 50 పైసలు చొప్పున మీయొక్క అమూల్యమైన ఓటును అమ్ముకుంటే మీ యొక్క భవిష్యత్తుని 50 పైసలకే తాకట్టు పెట్టిన వారవుతారు.

ఈ భారత దేశ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని మీకు మీరే తెచ్చుకున్న వారు అవుతారు కావున మీకు ఓటు పౌరులు ఓటరుగా తన చదువుకున్న మేధావులు సామాజికవేత్తలు నిరక్షరాస్యత గల ప్రజల కు అవగాహన కల్పించండి ఓటు యొక్క విలువను దాని యొక్క ప్రభుత్వ మార్పు విధానాల్లో జరిగే సంస్కరణలను గురించి అవగాహన చేయండి మీ కర్తవ్యాన్ని బాధ్యతగా గర్వంగా మీకు నా ఓటు హక్కుని నిర్భయంగా ఓటు వేయడానికి ముందుకు రండి అప్పుడు మంచి నాయకున్ని మేధావిని ఎన్నుకునే వారికి అధికారం నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకునే ప్రభుత్వ పాలన స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. భారతదేశంలోని ప్రజాస్వామ్య బద్దంగా జరిగే కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక ఎన్నికల లో మంచి నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి మేధావి, ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలను గుర్తించి స్పందించే లక్షణం కలిగి ఉండే వ్యక్తిని మరియు వారి వారి నియోజకవర్గాలలో సమస్యలను తీర్చి నూతన పాలసీలు సామాజిక మార్పు కి కృషి చేసే వ్యక్తిని,సామాజిక సేవ భావం కలిగిన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత భారతదేశంలోని పౌరులు అందరి మీద ఉంది ముఖ్యంగా యువతీ యువకుల మీద మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుని రేపటి భావి తరాన్ని భారతదేశాన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసిన నాయకుల్ని కులాలు మతాల వర్గాల అతీతంగా భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ స్వార్థం లేకుండా ప్రజలు జీవితాలలో అభివృద్ధిలో విద్య ఉపాధి విప్లాత్మక సంస్కరణ ఆదర్శవంతమైన పరిపాలన తీసుకొని వచ్చి నాయకున్ని మనకు రాజ్యాంగం 326 ఓటు హక్కు కల్పించడం జరిగింది. మీరు ఓటు హక్కు ని వజ్రాయుధంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని సంక్షేమాన్ని దేశ రాష్ట్ర పాలసీలు అంటే విధానాలను అవగాహన చేసుకుంటూ మీ స్వేచ్ఛను విధులను హక్కులను రక్షించుకోండి భారతదేశ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి లో కీలక పాత్ర పోషించండి.

మీ తాళ్ల పెళ్లి కుమారస్వామి
బర్త్డే ఎన్జీవో కోఆర్డినేటర్ ఇన్
వీణవంక మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్
ఇన్ కాకతీయ యూనివర్సిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *