అక్రమ అరెస్టులకు తెరలేపిన ప్రభుత్వం

అక్రమ అరెస్టులకు తెరలేపిన ప్రభుత్వం

ఎండి సాహెబ్ హుస్సేన్
వీణవంక, మార్చి 23 (విశ్వం న్యూస్) : కెసిఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను వీణవంక పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుని హక్కు అలాంటి హక్కులను కాలరాస్తూ పోలీస్ వ్యవస్థతో రాజ్యమేలుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం అత్యుత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వ మన్ననలు పొందడానికి అ ప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులను, అక్రమ అరెస్టులకు పూనుకుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీణవంక మండలంలో ఈ రోజు ఉదయం అక్రమ అరెస్టులు చేశారని ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, ఎండి రజాక్, ఎండి అన్వర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *