కన్నీటి పర్యంతమైన రిటైర్డ్ ఇంజనీర్

కన్నీటి పర్యంతమైన రిటైర్డ్ ఇంజనీర్”

హైదరాబాద్, జూలై 12: రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. తాము గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ అనేక అంశాలపై రాశామని, అయితే అప్పట్లో ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడలేదని అన్నారు. తమను పిలిపించుకుని చర్చించేవారని గుర్తుచేశారు.

దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాల కోసం సేవ చేశామని, అలాంటి తమను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలులో పెడతానని హెచ్చరించడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *