నిరుపేదల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్
తిమ్మాపూర్, జనవరి 22 (విశ్వం న్యూస్) : నిరుపేదల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమ ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సుడా చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణా రావు, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమ యి బాలకిషన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ రావుల రమేష్ తో పాటు పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించి అభినం దించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరింపచేయడం తో బిజెపికి భయం పట్టుకుందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపో తుందని, బిజెపి నాయకులు ఏది పడితే అది మాట్లా డుతున్నారని, కాంగ్రెస్, బిజెపి నాయకులు విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల లో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో ఇక్కడి కాంగ్రెస్, బిజెపి నాయకులు చూసి రావాలని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…ఎల్ఎండి కాలనీ నుండి నుస్తులాపూ ర్ వరకు సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటుకు కృషి చేస్తా మని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే నుస్తులాపూర్ గ్రామాo అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, తిమ్మాపూర్ మండలంలోనే ఆధునిక నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని అదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే జాతీయ స్థాయిలో నుస్తులాపూర్ 4 వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణరావు, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, జడ్పిటిసి ఇనుకొండ శైలజ-జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్, అసెంబ్లీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్ వీరారెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ బేతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘం పాలక వర్గ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.