న్యాయమైన వారి డిమాండ్లు
పరిష్కరించాలి: బల్మూరి వెంకట్

ఇల్లంతకుంట, జూలై 11 (విశ్వం న్యూస్) : ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజుల నుంచి గ్రామపంచాయతీ ఉద్యోగులు వారి వేతనాలు పెంచాలని ధర్నా చేయుచున్న సందర్భంగా ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ ధర్నా స్థలికి విచ్చేసి వారికి సంఘీభావం తెలిపి కరోనా కష్టకాలంలో గ్రామ ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రాణాల్ని త్యాగముగా పనిచేసిన గొప్ప కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు.
ఈరోజు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను GO.60 ప్రకారం గ్రామంలో పనిచేస్తున్న కార్మికులకు 15600, ఎలక్ట్రిషన్ కార్మికులకు19500, మరియు వారికి అందరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే ప్రభుత్వ సెలవుల్ని ఇవ్వాలని, 8 గంటల రోజుకు పని దినంగా సమయాన్ని సరిచేసి, వారిని ఇష్టమొచ్చినట్టుగా రోజుకు 10 నుండి 12:00 గంటలు పంజాబీ ఇచ్చే విధానాన్ని స్వస్తి పలకాలని, వారికి ప్రమాదంలో జరిగి మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ నీ హెచ్చరించారు.
వెంటనే వారి పక్షాన ఒక జీవోను రిలీజ్ చేసి డిమాండ్లు నెరవేర్చాలని హెచ్చరింరించారు. ఒకవేళ మేము అమలు చేయమని అంటే వారి పక్షాన ఎలాంటి పోరాటానికి అయినా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ప్రభుత్వానికి సూటిగా హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలి రామారావు, పరమేష్, రాము, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, శివ సాయి, కిరణ్, రామకృష్ణ, మహేష్, వంశీ, కిషన్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, NSUI మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.