కల్లు గీత చెట్లు నరికితే
మూడేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్, జూలై 20 (విశ్వం న్యూస్) : వచ్చే నెల 31 నాటికి రాష్ట్రంలోని ప్రతి తాటి, ఈత, ఖర్జూర, గిరిక చెట్లకు నంబర్లు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
కల్లు గీత చెట్లు నరికితే మూడేళ్ల జైలు శిక్ష, ఫైన్లను విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మాట్లాడుతూ..’చెట్లు ఎక్కేందుకు ఆధునిక సేఫ్టీ యంత్రాలను కార్మికులకు అందించాలి. కొత్త కల్లు షాపులను మంజూరు చేసి, వారికి లైసెన్సులు మంజూరు చేయాలి’ అని తెలిపారు.