ప్రశాంతంగా ఎస్ఐ అభ్యర్థుల రాతపరీక్ష
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐ(సివిల్/ఎఆర్/టిఎస్ఎస్పి/. ఎస్పీఎఫ్/ఎస్ఆర్ సిపియల్ / ఫైర్) అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా రాత పరీక్ష శనివారం నాడుప్రశాంతంగా ముగిసింది.
ఎస్ఐ అభ్యర్ధుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్ లో 18 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5.30 వరకు పరీక్ష కొనసాగింది.
పటిష్ట పోలీసు బందోబస్తు : కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నగరంలోని లాడ్జిలను తనిఖీ చేశారు… అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్ష ముగిసేంతవరకు మూసి ఉంచారు.
12.784 మంది హాజరు : శనివారం నాడు జరిగిన ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్షకు 12,784 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరైన అభ్యర్ధుల శాతం 94:84, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సమర్థవంతంగా విధులను నిర్వహించిన వివిధ విభాగాలకు చెందిన పోలీసులను కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు.