లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వెళ్లి చెక్కులను అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి

లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వెళ్లి
చెక్కులను అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో 19 కల్యాణలక్ష్మి చెక్కులను, 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్దిదారుని ఇంటివద్దకే వెల్లి అందించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ & బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పాడి కౌశిక్ రెడ్డి. మండలంలోని రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, గంగారం గ్రామాల్లో ప్రభుత్వం నుండి మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను ఇంటింటికి వెళ్ళి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డలకు మేనమామలా సీఎం కేసీఆర్ మారారని, వివాహం అయిన వెంటనే కట్నంగా రూ.లక్షా నూట పదహార్లు స్వయంగా అందజేస్తున్నారని అన్నారు. లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి సీఎం కేసీఆర్ లబ్ధిదారుల కుటుంబాలకు అందజేయాలని చెప్పారని, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా దేశంలోని ఏరాష్ట్రంలో లేని పథకాలను నేరుగా మన రాష్ట్రంలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న ఎన్నికలల్లో సీఎం కేసీఆర్ కు అండగా నిలబడాలని సూచించారు.

లబ్ధిదారుల్లో బీజేపీ కార్యకర్తలు కూడా ఉండడంతో సంతోషంగా వారు చెక్కులను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు అండగా నిలబడి ఎమ్మెల్యేగా నిలబడాలని కోరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నాయకులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, సర్పంచులు పోతుల నర్సయ్య, జున్నూతుల సునితా మల్లారెడ్డి, చదువు లక్ష్మి మహేందర్ రెడ్డి, పింగిలి కొమాల్ రెడ్డి, ఎంపీటీసీలు ఒడ్డెపల్లి లక్షీభూమయ్య, చదువు స్వరూప నర్సింహరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, జున్నూతుల జనార్దన్ రెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, పోతుల సురేష్, మాడ రవీందర్ రెడ్డి, ఇట్టబోయిన రాజయ్య, పైడిమల్ల శ్రీనివాస్, ఉగ్గి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *