మృత్యువు అంచుల్లో ప్రయాణికులు
> ప్రమాదాలకు నిలయంగా కోటగడ్డ జంక్షన్
> పెట్రోల్ బంక్ కు యూటర్న్ సమయంలో ప్రమాదా ఘటనలు
> వరుస ఘటనలలో 6 గురు దుర్మరణం
> ఘటనలపై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క
> నేషనల్ హైవే అధికారులు పర్యావేక్షించి ఘటనలు జరుగకుండా చూడాలి.
> ఫోన్ ద్వారా అధికారులను కోరిన ఎమ్మెల్యే
గోవిందరావు పేట డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : గోవిందరావు పేట మండలం లోని కొటగడ్డ కు పోయే జాతీయ ప్రధాన రహదారి మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది.జాతీయ రహదారి విస్తరణ లో బాగంగా డివైడర్ ను ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతం కావడంతో వాహనాలు వేగంగా దుసుకాసున్న కారణంగా ఇప్పటి వరకు 6 గురు రోడ్డు ప్రమాదంలో మరణించడం విచారకరం. ఎన్ హెచ్ అధికారులు స్పందించి కోటగడ్డ జంక్షన్ వద్ద యూటర్న్ లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు యూటర్న్ ప్రజల ప్రాణాలకు ముప్పు…
మండలంలోని పస్ర సమీపంలోని కోట గడ్డ జంక్షన్ వద్ద ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారి మూల మలుపు తో వాహన దారులు యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదాలకు గురువుతున్నారు.దీంతో ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తారు.జాతీయ రహదారి అధికారులు రోడ్డు డివైడర్ ను యూటర్న్ లేకుండా మూసి వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
యూటర్న్ తో ఎవరికి లాభం…
జాతీయ రహదారి అధికారులు రోడ్డు వెడల్పు లో బాగంగా నిర్మించిన డివైడర్ కోటగడ్డ జంక్షన్ వద్ద యూటర్న్ కు అవకాశం ఇవ్వడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడి ప్రమాధా ఘటనలు ఏర్పడుతున్నాయి.దీంతో ఇప్పటి వరకు ప్రమాద ఘటనలలో 6 గురు మృతి చెందడం జరిగింది.అధికారులు కోటగడ్డ జంక్షన్ వద్ద యూటర్న్ ఎందుకు ఏర్పాటు చేశారనీ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన యూటర్న్ తో ఎవరికి లాభం చేకూరుతుందని మండిపడుతున్నారు.పెట్రోల్ బంక్ నుండి వచ్చిన వాహనాలు జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవించి సామాన్య ప్రజల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాహన దారులు ఆవేదన చెందుతున్నారు.
రహదారి డివైడర్ ను మూసివేయాలని….
రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ రహదారి పై కోటగాడ్డ జంక్షన్ పెట్రోల్ బంక్ సమీపంలో గల యూటర్న్ డివైడర్ ను మూసివేయాలని వాహనదారులు అంటున్నారు.ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో 6 కుటుంబాలు బలయ్యాయని ,డివైడర్ ఇలానే ఉంటే మరి కొన్ని కుటుంబాలు బలికావల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు.జాతీయ రహదారి అధికారులు స్పందించి డివైడర్ ను మూసివేయాలని వాహనదారులు కోరుతున్నారు.