ఇష్టారాజ్యంగా త్రిబుల్ ఐటీ బాసర యునివర్సిటీ యాజమాన్యం

  • పియుసి 2 విద్యార్థిని విద్యార్థుల సెం (SEM) 2 ఎగ్జామ్స్ పూర్తికాకముందే ఎలాంటి సమాచారం లేకుండా విద్యార్థుల హాస్టల్ ఖాళీ చేసిన వైనం
  • టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కాస్పెటిక్స్, డ్రెస్సెస్,ఒరిజినల్ సర్టిఫికెట్స్ తదితరులు లాస్ అయిన విద్యార్థులు
  • విద్యార్థుల హాలిడేస్ ముందు ఎలాంటి సమాచారం లేదు.. హాలిడేస్ ఇచ్చాక వెబ్సైట్లో నోటిస్ పెట్టడం దారుణం
  • లక్షల రూపాయల బుక్స్, డ్రెస్సెస్, స్టడీ మెటీరియల్ లాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు
  • దీనికి ఎవరు బాధ్యులని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ తదితరులు డిమాండ్ చేస్తున్నారు

బాసర, జూన్ 4 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఇంటిగ్రిటీ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీ బాసర యునివర్సిటీ. యూనివర్సిటీలో సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళిన విద్యార్థిని విద్యార్థుల రూమ్స్ తాళాలు పగలగొట్టి రూమ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సెస్, కాస్మెటిక్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తదితర సామాన్లను హాస్టల్ కింది సెల్లార్స్ గదిలో పడేసి రేనవేషన్ చేసే విధంగా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీ యజమాన్యం. ఎలాంటి సమాచారం లేకుండా విద్యార్థిని విద్యార్థులు వేసిన తాళాలు పగలగొట్టి బుక్స్ తదితర సామాన్లు పడేయడం ఎంతవరకు సబబు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి ఎవరు బాధ్యులు పిల్లలందరి సామాన్లు కలిపితే లక్షల రూపాయలల్లో విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు లాస్ జరిగిందని దీనికి బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు పేరెంట్ కమిటీ వారు విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *