
జమ్మికుంట, జూన్ 5 (విశ్వం న్యూస్) : శనివారం జమ్మికుంట పట్టణ పరిధిలోని అభాధి జమ్మికుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం రోజున రైతులకు అవమానం. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు వేదికలో ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డి ప్రసంగిస్తూ ఉండగా … బుర్ర కుమార్ అనే రైతు ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది.
బుర్ర కుమార్ అనే రైతు కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ రైతు రుణమాఫీ 9 సంవత్సరాలు అవుతుంది, ప్రకటించిన రూపాయలు లక్ష రుణ మాఫీ ఇప్పటివరకు మొత్తం మాఫీ జరుగలేదని ప్రశ్నించారు. అలాగే అంతక్రితం వడగళ్ల వానకు వర్షం కు దెబ్బతిన్నమక్క పంటకు కూడా ఎకరానికి రూ.10,000/- లు ఇస్తానని ప్రకటించిన (తెలంగాణ ప్రభుత్వం) కే.సి.అర్ ఇప్పటివరకు అతీగతీ లేదు. పంట నష్టం ఎంక్వైరీ చేశారు కానీ ఇప్పటివరకు ఏ రైతుకు పంట నష్ట పరిహారం అందలేదు.

మొన్నటికి మొన్నఅకాల వర్షాల వలన పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి రూ.10,000/- లు ఇస్తానని ప్రకటించిన (తెలంగాణ ప్రభుత్వం) 3 నెలలకు పైగా అవుతుంది అయినా ఇప్పటివరకు నష్ట పరిహారం ఏ రైతుకు అందలేదు, ఇంకా ఒక ఇల్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు 9 సంత్సరాల 6 నెలలు అవుతోంది. అని కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తే కౌశిక్ రెడ్డి రైతును ఉద్దేశించి ప్రశ్నించిన రైతునే ధబాయింపుగా ఏ ఏ నీకు ఎన్నిఎకరాలు ఉంది అంటూ రైతును బెదిరింపు ధోరణిలో అడుగగా వెంటనే రైతు బుర్ర కుమార్ నాకు 3 ఎకరాలు ఉంది. అని సమాధానం ఇచ్చిన వెంటనే కౌశిక్ రెడ్డి రైతు అయిన బుర్రకుమార్ వైపు సూటిగా చూస్తూ…

సిగ్గుందా …సిగ్గు శరం ఉందా రైతు బంధు తీసుకోవట్లేదా 24 గంటల ఉచిత కరెంట్ పొందట్లేధా పించన్ తీసుకోవట్లేదా అంటూ ఆగ్రహం తో రైతులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం జరిగింది.
అలా కౌశిక్ రెడ్డి రైతులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం ఎంటి అంటూ రైతులు వారిలో వారు చర్చించుకుంటూ ఆగ్రహం తో (కౌశిక్ రెడ్డి రైతులను ఉద్దేశించి సిగ్గుందా….సిగ్గు ..శరం ..ఉందా అన్న తరువాత) వెంటనే రైతులనుంచి కౌశిక్ రెడ్డికి మాటల దాడి మొదలైనది. పరిస్థితి ప్రమాధకరంగా మారుతుందని గ్రహించి జై కే.సి.అర్ … జై కే.సి.అర్ అంటూ కౌశిక్ రెడ్డి సమావేశాన్నిఅర్ధాంతరంగా ముగించి ఆకడనుండి వెళ్లారు .

కొసమెరుపు
రైతు ప్రశ్నిస్తున్నపుడు కౌశిక్ రెడ్డి సిగ్గుందా సిగ్గు శరం ఉందా అని రైతులను అవమానించడం పైన రైతు బుర్ర కుమార్ కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నపుడు రైతును ఉద్దేశించి కుచో… కూచో… అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన బి.అర్.ఎస్ వ్యక్తి పైన… మరియు రైతు ప్రశ్నిస్తున్నపుడు సభావేదిక పైన ఉన్న నాయకులు అసహనం వ్యక్తం చేయడంపై నాయకుల పైన రైతులు ఆగ్రహంగా ఉండటం భవిష్యత్ కాలం ఏంటనేది ప్రశ్న.