వైభంగా సుందరకాండ హనుమత్ మహాయజ్ఞం

వైభంగా సుందరకాండ
హనుమత్ మహాయజ్ఞం

  • పాల్గొన్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి దంపతులు

కరీంనగర్ బ్యూరో, మే 12 (విశ్వం న్యూస్) : భగవంతుని ఆరాధన చాలా విశిష్టమైనదని మరియు చాలా విజయాలు సిద్ధిస్తాయని తద్వారా సుఖవంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర ఎ.సి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో వైభంగా ఏర్పాటు చేసినటువంటి సుందరకాండ హనుమత్ మహాయజ్ఞం ప్రథమ రోజు పూజకు ప్రధానకర్తగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు ప్రాంగణంలో శ్రీ బాలహనుమన్ ఆలయంలో మూలవిరాట్టుకు విశేష పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పూజ కార్యక్రమాలను నిర్వహించాలని మరియు విశ్వశ్రేయస్సుకై కృషి చేసి అగ్రగామిగా నిలవడమే సమాజ అభివృద్ధికై చేయూతనివ్వాలని కోరారు. ప్రత్యేకంగా అంజనేయస్వామి పూజలు చాలా ప్రత్యేకత గలవని మరియు సకల భాదలయందు కష్టాల చెరనుండి విముక్తి కల్పించి నూతన జీవితానికి పునాది వేస్తుందని చెప్పారు.

శ్రీశ్రీశ్రీ కొండగట్టు అంజనేయస్వామి ఆశీస్సులతో వేదబ్రహ్మణుల మార్గదర్శకమున మూడు రోజులపాటు విశేషంగా పూజలు ఘనంగా వివిధ ద్రవ్యాలతో వేడుకగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మొదటి రోజు పూజలో భాగంగా భగవత్ అనుజ్ఞ, విశ్వక్సేవ ఆరాధన, పుణ్యవచనం, రక్షభంధనం, ఆచార్య రుత్విక్ వర్ణం, మండలారాధన, కుంభ డింభ ఆరాధన మరియు సుందరకాండ పారాయణ్, హెూమం ప్రారంభించడం మరియు పఠనం నిర్వహించడం జరిగినది చెప్పారు.

హనుమాన్ దీక్షాపరులు అధిక సంఖ్యలో హాజరై హనుమాన్ చాలీసా 11 సార్లు సాముహికంగా పఠించారని మరియు భజనలతో భక్తి వాతావరణాన్ని పెంపొందించారు. విచ్చేసిన దీక్షాపరులకు భిక్ష మరియు భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగినది చెప్పారు. రేపు మరియు ఎల్లుండి కూడా స్వామి వారి కార్యక్రమాలు విశేషంగా శ్రీమద్రామయణం పఠనం చాలా రమణీయంగా ఉంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *