‘మహిళా భద్రత’పై
అవగాహన సదస్సు
వీణవంక, జూన్ 23 (విశ్వం న్యూస్) : వీణవంకలో ఎస్ఐ కే. శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో “మహిళా భద్రత”పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా HAWK EYE app, SHE టీం బృందాలు, 100 డయల్, 181 ఉమెన్ హెల్ప్ లైన్, 1098చ్ చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ల ప్రాముఖ్యతను గూర్చి వివరించడం జరిగింది.
1098 ఈ నంబర్ చిన్నపిల్లలను బెదిరించిన, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, పిల్లలను పనిలో పెట్టుకున్న, వారి చదువును ఆటంకపరిచిన, పిల్లలు అక్రమ రవాణాకు గురైన, పిల్లలు తప్పిపోయిన, పిల్లలు మదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురైన, పిల్లలు బాల్యవివాహాలు, వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఈ 1098 నెంబర్ ఉపయోగపడుతుందని, 181 లైంగిక వేధింపులు, మహిళ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలనీ, తద్వారా బాధితులకు తక్షణ సహాయం, రక్షణతో పాటు కౌన్సిలింగ్, గైడెన్స్ అందించబడుతుంది.
పోలీసు వారు ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ నెంబర్లు వాడితే మిమ్మల్ని రక్షించే వాల్లం అవుతామని. ఆడవారిని ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేసిన వెంటనే పోలీసులు మీ దగ్గరికి కొన్ని క్షణాలనే చేరుకొని మిమ్ములను రక్షించి, మిమ్ములను ఇబ్బంది పెట్టిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శేఖర్ రెడ్డి తెలిపారు.