జంట కార్పొరేషన్ల ఎస్ఎన్ డిపి పనుల జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

జంట కార్పొరేషన్ల ఎస్ఎన్ డిపి
పనుల జాప్యంపై కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

పీర్జాదిగూడ, జూన్ 24 (విశ్వం న్యూస్) : పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు, కార్యవర్గాల సభ్యులందరి అధ్వర్యంలో ఎస్ ఎన్ డి పి పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ శనవారం ఉప్పల్ డిపో ఎదురుగా చేపట్టనున్న నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీర్జాది గూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్ కోరారు.

ఈ కార్యక్రమం పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని.. గత రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో జంట కార్పొరేషన్లు బోడుప్పల్ – పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలోని నీటమునిగిన ప్రాంతాల ప్రజలు, కార్పొరేషన్ లోని ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు తెగిపోయి, అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతిపక్షాల పోరాటాలతో తూతూ మంత్రంగా రూ.110 కోట్ల వ్యయంతో ఎస్ ఎన్ డి పి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మల్లారెడ్డిలు. శంకుస్థాపన చేసి 18 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తికాక ప్రజలు అవస్థలు పడుతున్నా మొద్దు నిద్రవీడని ప్రభుత్వ వైఖరిని, ఎస్ ఎన్ డి పి పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహించనున్న నిరసన దీక్ష కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిదులుగా హాజరవనున్నారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు, ముంపు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *