23న వీర సింహారెడ్డి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : వీర సింహారెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే హాట్‌స్టార్ వేదికపై ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పింది హాట్‌స్టార్ టీమ్.