వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి : కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

వనమహోత్సవంలో భాగస్వాములు
కావాలి:కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

హైదరాబాద్, జూలై 24 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో వార్డు శివ సాయి నగర్ కాలనీలో ఈరోజు మొక్కలు పంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వర్షాకాలంలో మొక్కలు నాటి రాబోయే తరానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు సావూజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ సూచించారు.

చెట్లు నాటడం వలన వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తాయి వర్షాలు కురిస్తే గాని మనకు పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కృష్ణ, సాగర్, సిబ్బంది రామాంజనేయులు, యోగేశ్వర్, అరుణ, రమణారెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *