ఆసరా ఏది

ఆసరా ఏది

మహమ్మద్ సాహెబ్ హుస్సేన్
వీణవంక, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : కొత్త పెన్షన్లు మంజూరైన కూడా డబ్బులు రావడం లేదు అర్హత ఉన్న కూడా దరఖాస్తులు తీసుకోవడం లేదు ఆసరా కార్డులు ఉన్న ఖాతాల్లో డబ్బు జమ చేయడం లేదు. గతంలో పింఛన్లు పొందిన వారిని ఏ కారణాలతో తొలగించారు? గత నవంబర్ లో కార్డులు ఇచ్చి ఇంతవరకు ఆసరా పెన్షన్ డబ్బులను వీణవంక మండలంలో దాదాపు 1000 మంది లబ్ధిదారులకు ఇవ్వలేదు అధికారులు వెంటనే స్పందించి ఆసరా పెన్షన్ డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేయాలి గ్రామాల్లో పనులు లేక ఆసరా పెన్షన్ పైన ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి నవంబర్ మాసంలో ఇచ్చిన కార్డులకు పెన్షన్లు జమ చేయాలి లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని పేద ప్రజలను ఆదుకోవాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *