రేవంత్ రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలని విస్తృత ప్రచారం : ములుగు ఎమ్మెల్యే సీతక్క

రేవంత్ రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలని విస్తృత ప్రచారం : ములుగు ఎమ్మెల్యే సీతక్క

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) కార్యకర్తలకు దిషానిర్దేశం చేశారు. ఆదివారం గోవిందరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీతక్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె కోరారు. సోమవారం నుండి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రలో ప్రతి కార్యకర్త కొనసాగాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ పాదయాత్ర ప్రారంభ సూచికంగా మన దేవతలకు మొక్కులు చెల్లించుకుని పసర దయ్యాలవాగు నుండి ఈ పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు వెంకటకృష్ణ జనార్దన్ రెడ్డి జట్టి సోమయ్య కొనతల నాగేందర్ పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి ఎంపీటీసీ ఏడుకొండలు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి సత్తిరెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *