ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం

ఐక్య ఉద్యమాలతోనే
రాజ్యాధికారం:విఠల్ పటేల్

  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకుంట విఠల్
  • టీఎంకేజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సత్కారంలో

కరీంనగర్, మార్చి 3 (విశ్వం న్యూస్) : ఐక్య ఉద్యమాలతోనే మున్నూరు కాపులు రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చని దీనికోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకుంట విఠల్ పటేల్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో శుభమంగ ల్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్ అధ్యక్షత వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చింతకుంట విఠల్ పటేల్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో మున్నూరు కాపులు పాత్ర కీలకమైం దన్నారు. నీరు, నిధులు, నియమాకాలు వస్తాయన్న ఆశతో ఉద్యమాన్ని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితే సాధించుకున్న రాష్ట్రన్ని అదోగతి చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాపులు మౌనంగా ఉన్నంత వరకు ఎలాంటి రాజ్యాధికారిన్ని సాధించుకునే పరిస్థితి ఉoడదన్నారు. పాలక వర్గాలు కాపుల దగ్గరకు వచ్చి ప్రాధయవడాల్సిన పరిస్థితి కల్పించలన్నారు. ఎక్కువ జనభా ఉన్న బీసీలు ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్న అగ్రవర్ణలా పెద్దరికం వల్ల చేజారిపో యిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి స్థాయి పదవు లను కూడా వదులుకున్న సందర్భలు ఉన్నాయ న్నారు. మున్నూరు కాపులు ఇదే తరహాలో ఐక్యంగా ఉంటే రానున్న మూడేళ్లలో ఐలమైన శక్తిగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాల శ్రీనివాస్ మాట్లాడు తూ.. సామాజిక చైతన్యాన్ని తీసుకచ్చినప్పుడే కాపులు బలపడతారని, కాపులను మరో ఉద్యమా నికి ఉసి గొల్పేందుకు సిద్ధం కావాలన్నారు. ఐక్యంగా ఉనప్పడే మన బలం, బలగం పెరుగుతుందని, మనలో మనల్ని విచ్చినం చేసే శక్తుల పట్ల అప్రమ త్తంగా ఉoడాలని సూచించారు.

రాబోయే రోజుల్లో కాపులు రాజకీయంగా ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగి రాజ్యాధికార దిశ గా పయనించేందుకు సిద్ధం కావాలన్నారు. మున్నూరు కాపుసంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండి వద్మ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లో కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుం టున్నారే తప్ప వారి భవిష్యత్ పట్ల ఏ నాయకులు శ్రద్ద చూపడం లేదన్నారు. కాపులను నిందించిన ప్పుడు ఎదిరించే సత్తాను పెంచుకోకపోతే భవిష్యత్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. మహిళలతో పాటు మున్నూరుకాపుల్లో అన్ని విభాగాలతో కలిసి జేఏసీ గా ఏర్పడి ఉద్యమానికి రూపకల్పన చేయలన్నారు. కాపుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేసిన ప్పుడే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంద న్నారు.

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం శ్రమించని వ్యక్తులే అధికారం సాధించి పబ్బం గడువుకుంటున్నారని ఆరోపించారు. జనబాలో సింగిల్ డిజిట్ దాటని వర్గాలే మొదటి నుంచి బీసీలను అనగదొక్కుతు రాష్ట్రన్ని పాలిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించిన మున్నూరు కాపు సంఘ నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఫోరం క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు పటేల్ యూత్ ఫోర్స్ లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు సాయినరేందర్, రాజ్కుమార్, మాజీ బార్ సోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజీరెడ్డి, కవి పసుల రవి కుమార్, మాజీ తహసిల్దార్ కొట్టె వెంకటనారా యణ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మామిడి రమేష్ పటేల్, ప్రముఖ ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, ఆకుల ప్రభాకర్, ఉప్పు తిరుపతి, పత్యం వసంత, సుదీర్, ఉద్యోగల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ , రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గంట విజయ్ కుమార్, సీనియర్ రిపోర్టర్ శ్రీధర్ తో పాటు జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గానికి ఘన సన్మానం..
ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యవర్గాంలో కరీంనగర్ జిల్లా నుండి అవకాశం పోందిన ఉపాధ్యాక్షులు గా కామినేని మధుసుదన్, రాష్ట్ర కార్యదర్శలుగా ఏబూసి శ్రీనివాస్, దూలూరి జగన్మోహన్, అర్గనైజింగ్ సెక్రటరీగా అట్టపల్లి శ్రీనివాస్, మహిళ రాష్ట్ర కార్యదర్శిగా జే. సుమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పోకల మధు, బొమ్మిడి విజయకుమార్, సిరిసిల్లా జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా నూగురి మహేశ్, కార్యదర్శి గదిల ప్రవీణ్, ఎడ్ల చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పల ప్రసాద్, జగిత్యాల జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా పాముల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎర్రం చందనకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ముస్కు లక్ష్మి నారాయణ, గండ్ల వేణుగోపాల్, కు నియమకపత్రాలు అందజేయ డంతో పాటు శాలువతో ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *