బండ్లగూడ జాగీర్:ప్రపంచ పర్యావరణ
దినోత్సవ అవగాహన సదస్సు

- తెలంగాణ రాష్ట్ర ఇంధన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో….
బండ్లగూడ జాగీర్, జూన్ 4 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంద్ర వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించగా పలువురు అధికారులు అవగాహన కల్పిస్తూ రోజువారి జీవితంలో ఉపయోగిస్తున్న ప్రాణాధారమైన నీటిపైన, ఇంధనం, పెట్రోల్, డీజిల్, పొదుపుపై విద్యుత్ వాడకం పొదుపు చేయడంతో పాటు విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధంగా సోలార్ సహాయంతో ఇంటి పైన ఏర్పరచుకొని ఆదాయం పొందవచ్చు. చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎల్ఈడి బల్బులను వాడి విద్యుత్ను పొదుపు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, మేనేజర్లు వేణుగోపాల్, అశోక్, ఓం ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి ప్రేమ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మరియు పరిసర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
