బోడుప్పల్ కార్పొరేషన్ కు
100 కోట్ల నిధులు కేటాయించాలని
మంత్రి మల్లారెడ్డికి వినతి
బోడుప్పల్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి,డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు కలిసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి బోడుప్పల్ నగర అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ విషయమై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ త్వరలోనే పురపాలక మంత్రి కేటీఆర్ తో మాట్లాడి నిధులు తీసుకవద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్,భూక్యా సుమన్, చీరాల నర్సింహా, సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, కాటపల్లి రామచంద్ర రెడ్డి, మోదుగు శేఖర్ రెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, పూలకండ్ల జంగారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, జక్కల రాములు తదితరులు పాల్గొన్నారు.