టిపిఎస్ కావ్యకు స్వాగతం పలికిన
మేయర్ సామల బుచ్చిరెడ్డి

డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్,
కార్పొరేటర్లు హాజరు
బోడుప్పల్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : బోడుప్పల్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో నూతనంగా నియమితులైన టి పి ఎస్ కావ్య ని మేయర్ సామల బుచ్చిరెడ్డి శాలువాతో సత్కరించి పుష్పగిచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, పూలకండ్ల జంగారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, బంధారం శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.