50 కోట్లతో బడ్జెట్ హోటల్

మహబూబ్ నగర్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ ఆవరణలో 50 కోట్ల తో నిర్మించనున్న బడ్జెట్ హోటల్ మరియు వాణిజ్య సముదాయ భూమి పూజ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ మంత్రివర్యులు డా” వి.శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు.

ఈ కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్, కలెక్టర్ జి రవి నాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.