బైరాగిగూడలో డ్రైనేజ్ పనులకు ₹12 లక్షల మంజూరు

బైరాగిగూడలో డ్రైనేజ్ పనులకు
₹12 లక్షల మంజూరు

  • ఎమ్మెల్యేకు, కమిషనర్‌కు కాలనీ వాసుల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నవంబర్‌ 28 (విశ్వం న్యూస్):: బైరాగిగూడ విద్యానగర్ ఫేజ్-2 వికర్ సెక్షన్ కాలనీలో డ్రైనేజ్ పనుల కోసం మొత్తం ₹12 లక్షల రూపాయలను ఎమ్మెల్యే గారు సర్వతోముఖంగా మంజూరు చేసినట్లు కాలనీ నివాసితులు తెలిపారు. కాలనీలో పెరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని తమపై దయ చూపి వెంటనే నిధులు విడుదల చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, నరసింహ మార్కెటింగ్, నార్సింగ్ మార్కెటింగ్, డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, కాలనీ వాసులు దస్తగిరి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజ్ వర్క్ విడుదలకు సహకరించిన కమిషనర్ గారికి కూడా కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పనులు ప్రారంభం కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *