బోడుప్పల్ కార్పొరేషన్ లో 258 తీర్మానాలు 43 కోట్ల పనులు పెండింగ్

బోడుప్పల్ కార్పొరేషన్ లో 258 తీర్మానాలు 43 కోట్ల పనులు పెండింగ్

  • 31న అధికార పార్టీ కార్పొరేటర్
    ఆధ్వర్యంలో కార్పొరేషన్ లో ధర్నా..
  • అధికారుల అలసత్వంతో
    అభివృద్ధిలో కుంటుపడుతున్న బోడుప్పల్..

బోడుప్పల్, మార్చి 29 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమస్యలపై 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్ధానిక కమిషనర్ కు 3 మార్చి రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, 15 రోజుల్లో ప్రధాన రహదారుల్లో రోడ్లు వేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్వయంగా వచ్చి అధికారులకు సూచించి 15 రోజుల్లో పనులు చేయాలని హెచ్చరించి వెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజుకి 25 రోజులుగా వస్తున్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

ప్రధానంగా ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, ప్యాచ్ వర్క్స్ ఈ పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి మూడు సంవత్సరాలుగా 258 తీర్మానాలు,రూ. 43 కోట్ల రూపాయలతో తీర్మానాలు చేసి మంత్రి మల్లారెడ్డి మేయర్ కమిషనర్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఒక సంవత్సరం గడుస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు.ఆఫీషల్ కౌన్సిల్ సభలో రాసాల వెంకటేష్ యాదవ్ అధికారులను నిలదీసినప్పటికినీ ఎలాంటి మార్పులు లేవంటే అధికారులు ఎందుకు సాలరీస్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని హెచ్చరించారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే దాఖలాలు లేవు. కాగితాలకే పరిమితం అవుతున్నాము. ఈ దేశానికి రైతే వెన్నుముక.. ఈ కార్పొరేషన్ కి ప్రజలే వెన్నుముక.. ఎందుకంటే వాళ్ల రక్తాన్ని చెమట రూపంలో మలిచి నిరుపేద ప్రజలు టాక్సీలు కడుతుంటే మనం మాత్రం జీతాలు తీసుకుంటూ వాళ్లకు ఎలాంటి సేవ చేయడం లేదని, వాళ్ళ పాపం మనకు తలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ కమిషనర్ అధికారులకు వ్యతిరేకంగా, ప్రజల పక్షాన తేదీ 31 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. మరో నాయకుడు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ అధికారులకు కాంట్రాక్టర్లు కమిషన్లు అక్రమ కట్టడాలు బిల్లుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని పాత కమిషనర్ అక్రమ కట్టడాల మీద ఎంత టైప్ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం తన పనులు తాను చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. పాత కమిషనర్ 400 అక్రమ కట్టడాలు గుర్తించి 16 కట్టడాలు కూల్చారని ఇంకా 384 అక్రమ కట్టడాలు అలానే ఉన్నాయని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *